బర్త్‌డే గిఫ్ట్.. భగవంత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్
కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించింది.
By Srikanth Gundamalla Published on 19 Jun 2023 1:10 PM ISTబర్త్‌డే గిఫ్ట్.. భగవంత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్
అందాల తార కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. పెళ్లాయ్యాక ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే.. ఇన్నాళ్ల తర్వాత తాజాగా ఆమె బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించింది. భగవంత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ శారీలో హోమ్లీగా కనిపించారు. ఫోన్ మాట్లాడుతూ చేతిలో సైకాలజీ బుక్ పట్టుకుని ఉంది. పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని.. చిరునవ్వులు చిందిస్తూ ఉంది. దీంతో.. సినిమాలో ఆమె క్యారెక్టర్‌పై అందరిలో ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ సరసన కాజల్ తొలిసారి నటిస్తోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో భగవంత్ కేసరి సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్నారు. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ఈ భగవంత్ కేసరి సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
భగవంత్ కేసరి మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లను అందజేస్తున్నారు. టైటిల్ విడుదల చేశాక.. టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న శ్రీలీల ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తోన్నారు. ఈ సినిమాతోనే అర్జున్ రాంపాల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దసరాకు భగవంత్ కేసరిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో భగవంత్ కేసరితో పాటు సత్యభామ అనే సినిమాలోనూ నటిస్తోంది. అఖిల్ డేగల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి కూడా రానుంది. ఇక తమిళంలో కమల్‌హాసన్ సరసన ఇండియన్-2 సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్. ఈ భారీ బడ్జెట్ మూవీకి శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు.