జానీ మాస్టర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 3:00 PM ISTటాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లేడీ కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు. తాజాగా వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని హైదరాబాద్ పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అక్టోబరు 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత జానీ మాస్టర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ అన్నారు. తనను కావాలని ఇరికించిన ఆరోపణలు చేశారు. తనని ఇందులో ఇరికించిన వారిని మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వదిలిపెట్టనంటూ హెచ్చరించాడు. కాగా.. జానీ మాస్టర్ అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధించిన తర్వాత జానీ మాస్టర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.