తొలిరోజు కలెక్షన్లలో రికార్డులను కొల్లగొట్టిన 'జవాన్' సినిమా
తాజాగా 'జవాన్' సినిమాతో మరో హిట్ సాధించాడు షారుఖ్. తొలిరోజు వసూళ్లలో రికార్డులను కొల్లగొట్టింది ఈ మూవీ.
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 9:50 AM ISTతొలిరోజు కలెక్షన్లలో రికార్డులను కొల్లగొట్టిన 'జవాన్' సినిమా
బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్ 2023లో తన సత్తా చాటుడుతున్నాడు. అంతకుముందు నాలుగేళ్లపాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యిన షారుఖ్.. ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్' సినిమాతో హిట్ ట్రాక్ మొదలుపెట్టాడు. ఏకంగా ఈ మూవీ రూ.వెయ్యి కోట్లను కొల్లగొట్టింది. తాజాగా 'జవాన్' సినిమాతో మరో హిట్ సాధించాడు. తొలిరోజు వసూళ్లలో రికార్డులను కొల్లగొట్టింది ఈ మూవీ. పఠాన్ తొలిరోజున భారత్‌లో రూ.55కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.125 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌కాన్ తన రికార్డుని తానే బద్దలు కొట్టారు. విడుదలైన తొలిరోజే జవాన్ మూవీకి మంచి టాక్ వచ్చింది. దాంతో విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఇండియాలో జవాన్ మూవీ అన్ని భాషల్లో కలిపి తొలిరోజు రూ.75 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక వరల్డ్ వైడ్‌గా అయితే రూ.125 కోట్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను షారుఖ్ జవాన్ సినిమా బద్దలుకొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ సినిమా తొలిరోజు వసూళ్లు రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్-2 రూ. 54 కోట్లు, బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి.
షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. దాని తర్వాత వరుసగా హిట్ కొట్టాడు షారుఖ్. కాగా, తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. దీపిక పదుకొణె, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. తొలిరోజే ఇంతపెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్లు రాబడుతుంతో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. జవాన్ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం.. రికార్డులను కొల్లగొడుతుండటంతో షారుఖ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.