గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న షారుక్‌ 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియో

జవాన్‌ చిత్ర యూనిట్‌ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. ఎంతో ఆకట్టుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  10 July 2023 6:08 AM GMT
Jawan, Movie, Prevue Video, Shah Rukh Khan,

గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న షారుక్‌ 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియో

గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న షారుక్‌ 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియోబాలీవుడ్‌ బాద్‌షా నటిస్తోన్న 'జవాన్‌' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. 'పఠాన్‌' సినిమాకు మించి యాక్షన్‌ సీన్లు ఉంటాయని.. బాక్సాఫీస్‌ వద్ద మరోసారి రికార్డు సృష్టించడం ఖాయమని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జవాన్‌ సినిమా యూనిట్‌ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. దీన్ని చూశాక షారుక్‌ అభిమానులు మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న వీడియోను చూసి ఎంతో ఆనందపడుతున్నారు. మళ్లీ షారుక్‌కు పెద్ద హిట్‌ పడుతుందని అంటున్నారు.

తమిళ దర్శకుడు అట్లీ, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కాంబలో వస్తోంది 'జవాన్' సినిమా. చిత్ర యూనిట్‌ ప్రివ్యూ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌తో భారీ అంచనాలు నెలకొంటే.. ఈ ప్రివ్యూ వీడియో వాటిని మరింత బలపరిచింది. ఇందులో నయనతార హీరోయిన్‌గా, విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది. సెప్టెబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది జవాన్‌ మూవీ. జవాన్‌ను భారీ బడ్జెట్‌తో షారుక్‌ఖాన్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది.

'జవాన్' ప్రివ్యూ వీడియోలో షారుక్‌ ఓవైపు పోలీస్ అధికారిగా స్టైలిష్‌గా కనిపించారు. అలానే జవాన్‌గానూ ఆకట్టుకున్నారు. ఇక ముఖానికి ముసుగు వేసుకుని పవర్‌ఫుల్‌ మాస్‌ అవతారంలోనూ కనిపించారు. హీరోయిన్‌గా నయనతార స్టైల్‌గా కనిపించింది. దీపికా పదుకొణె ఫైటింగ్‌ సీక్వెన్స్‌ షాట్‌ అయితే అదిరిపోయింది. యాక్షన్ విజువల్స్‌ ఈసారి గూస్‌బంప్స్‌ తెప్పించాయి. చిన్న ప్రివ్యూ వీడియోలోనే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక షారుక్‌ 'నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేదు' అంటూ డైలాగ్‌ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. వీడియో చివర్లో షారుక్‌ గుండు గెటప్‌లో కనిపించారు. ఫన్నీగా డ్యాన్స్‌ చేశారు. జవాన్‌ ప్రివ్యూ వీడియో విడుదలపై షారుక్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. తెలుగులో ఎవరు నేను .., ఎవర్ని కాను , అని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రివ్యూ వీడియోలో వచ్చే డైలాగ్‌ను రాసుకొచ్చారు.

Next Story