వచ్చే వారమే ఓటీటీలోకి 'జైలర్'.. ఎక్కడంటే..
జైలర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 12:09 PM ISTవచ్చే వారమే ఓటీటీలోకి 'జైలర్'.. ఎక్కడంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్ర 'జైలర్' బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. వచ్చే వారమే స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సెప్టెంబర్ 7వ తేదీన రానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీన జైలర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందని ట్వీట్ చేసింది. అయితే.. ముందు సన్‌నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో జైలర్ సినిమా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.
తలైవా రజినీకాంత్ స్టైల్, యాక్షన్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడంతో జైలర్ అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్లను సాధించటంతో ఈ చిత్ర నిర్మాత కళానిధి మారన్.. హీరో రజినీకాంత్‍కు ఓ లగ్జరీ కారును, ఓ చెక్‍ను అందజేశారు. బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. భారీ మొత్తం విలువైన చెక్‍ను కూడా అందజేశారు. అలాగే, జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు కూడా ప్రీమియర్ కారును బహుమతిగా ఇచ్చారు కళానిధి మారన్. చాలా కాలం తర్వాత సరైన హిట్ పడిందంటూ తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
జైలర్ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వినాయకన్, రమ్యకృష్‌ణ, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు, సునీల్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు.
Jailer's in town, it's time to activate vigilant mode! 🔒🚨#JailerOnPrime, Sept 7 pic.twitter.com/2zwoYR6MqV
— prime video IN (@PrimeVideoIN) September 2, 2023