ఈ మధ్య కాలంలో వెబ్‌సిరీసుల్లో బూతులు కామన్ అయిపోయాయి. బూతు మాటలు, శృంగార సీన్లు లేకుండా వెబ్‌సిరీస్‌లు తీయని పరిస్థితి. ఓటీటీకి సెన్సార్ బోర్డు ఉండదు కాబట్టే ఈ విచ్చలవిడిగా శృంగార సీన్లు, బూతు డైలాగ్స్ ఉంటున్నాయి. అయితే.. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు మాత్రం సెన్సార్ ఇలాంటివి అనుమతించదు. అభ్యంతరకర సీన్లను విడుదలకు ముందే పరిశీలించి తొలగిస్తుంది. ఈ క్రమంలోనే జగపతిబాబు సినిమాకు సెన్సార్ బోర్డు తన కత్తెరకు పని చెప్పింది.
జగపతిబాబు లీడ్ రోల్‌లో వస్తున్న సినిమా రుద్రంగి. ఈ నెల 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం సినిమా కాపీని సెన్సార్ బోర్డుకు పంపింది. మూవీ సీన్లను పరిశీలించిన సెన్సార్ బోర్డు తన కత్తెరకు పని చెప్పింది. ఒక చోట కాదు సినిమాలో ఉన్న బూతులను అన్ని చోట్ల కట్ చేసింది. అంతేకాక సబ్‌టైటిల్స్‌లో వచ్చే బూతు పదాలను కూడా సీజీ ద్వారా కనబడకుండా చేసినట్లు సెన్సార్ తెలిపింది. అంతేకాక హింసాత్మక సీన్‌ను కూడా 50 శాతం వరకు కట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో.. ఇంత భారీ మొత్తంలో సెన్సార్ కత్తెర వేయడంతో ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.