అమ్మడివి ఏడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయట
It's a packed year for Rakul Preet Singh with 7 releases.రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా
By M.S.R Published on 19 Jan 2022 12:58 PM ISTరకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె తన దృష్టిని బాలీవుడ్ వైపు కేంద్రీకరించింది. ఈ ఏడాది అనుకున్నట్లుగా జరిగితే ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. రకుల్ ప్రీత్ సింగ్ 2022 సంవత్సరంలో ఏడు భారీ సినిమాల విడుదలలను కలిగి ఉంది. వాటిలో ఆరు హిందీ సినిమాలకు సంబంధించినవి.
బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న సినిమాలలో ఆయుష్మాన్‌తో 'డాక్టర్ జి', అమితాబ్ బచ్చన్ & అజయ్ దేవగన్‌లతో 'రన్‌వే 34', అజయ్ దేవగన్ & సిద్ధార్థ్ మల్హోత్రాతో 'థ్యాంక్ గాడ్', 'చత్రీవాలి', 'ఎటాక్' మరియు అక్షయ్ కుమార్‌తో మరో చిత్రంలో చేస్తూ ఉంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.
రకుల్ మాట్లాడుతూ తన కెరీర్ లో "2022 నా ఉత్తమ సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. 2022 కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. 6 సినిమాలు హిందీలోనే ఉన్నాయి. ఆ సినిమాల షూటింగ్‌లో అద్భుతమైన అనుభవాన్ని పొందాను. సినిమాలు విడుదలవ్వడం మొదలైన తర్వాత ప్రతి పాత్ర ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుందని మీరు గమనిస్తారు, ప్రతి చిత్రం విభిన్నమైన శైలిని కలిగి ఉంటుంది." అని తెలిపింది. "సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'అటాక్' కాగా, నేను పైలట్‌గా నటించిన 'రన్‌వే 34' ఉంది, ఆపై నేను గైనకాలజిస్ట్‌గా నటించిన 'డాక్టర్ జి' ఉంది, 'థాంక్ గాడ్' సినిమా ఒకటి.. కమర్షియల్ జోన్ అయిన అక్షయ్ సర్ చిత్రం, ఆపై నేను కండోమ్ టెస్టర్‌గా నటిస్తున్న 'చత్రీవాలి' ఉన్నాయి. కాబట్టి గత 2 సంవత్సరాల శ్రమకు సంబంధించిన ఫలితం ఈ ఏడాది కనబడుతుంది" అని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఏకంగా 7 సినిమాల రిలీజ్ అంటే ఏ నటీ నటులకైనా ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు.