'యానిమల్' సినిమా ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు
'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:45 AM IST'యానిమల్' సినిమా ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు
బాలీవుడ్ హీర్ రణ్‌బీర్ కపూర్.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'యానిమల్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. 900 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. తండ్రీ, కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీకి ప్రజాదరణ బాగా లభించింది. అయితే.. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు ముందు కొన్ని చిక్కుల వచ్చి పడుతున్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. 26వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మరోసారి చూసేందుకు అందరూ సిద్దం అవుతున్నారు. ఎందుకంటే థియేటర్లలో లేని కొన్ని సీన్లను సందీప్ వంగా యాడ్ చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పారు. రన్ టైమ్ ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సీన్లను థియేటర్లలో తొలగించామనీ.. కానీ ఓటీటీ వేదికగా మాత్రం వాటిని యాడ్ చేసి స్ట్రీమింగ్‌లో ఉంచుతామని చెప్పారు. ఈనేపథ్యంలో సినిమాను థియేటర్లలో చూసినవారు కూడా మరోసారి ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కాగా.. యానిమల్ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులోని సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం కుదరగా.. వారి నుంఇ ఇప్పటి వరకూ రూపాయి అందలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సినీ1 స్టూడియోస్ ఢిల్లీ కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇదే అంశంపై జవనరి 22న ఢిల్లీ కోర్టులో విచారణ జరగుతుంది. ఈ నేపథ్యంలో అనుకున్నట్లుగా రిపబ్లిక్ డే రోజున యానిమల్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.