ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్ నటిస్తున్నారా..?
ధనుష్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 6:15 PM ISTఇళయరాజా బయోపిక్‌లో ధనుష్ నటిస్తున్నారా..?
కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ టాప్ హీరోల్లో ఒకరు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే.. ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో ఒకటి టైటిల్ రోల్ పోషిస్తున్న కెప్టెన్ మిల్లర్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు ధనుష్ కథనందిస్తూ.. స్వీయదర్శకత్వంలో హీరోగా రానున్న మరోసినిమా డీ50. మరో సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కూడా యాక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇలా వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉన్న ధనుష్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి తెలుసుకున్న అభిమానుల ఖుషీ అవుతున్నారు కూడా.
ఇళయరాజా మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. మ్యూజిక్‌మ్యాస్ట్రో అంటుంటారు. అయితే.. ఇళయరాజా బయోపిక్ తీయనున్నారనీ.. అందులో ధనుష్ నటిస్తున్నారని ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 2024లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. అయితే.. 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను Connekkt Media ఈ సినిమాను తెరకెక్కించనుందట. అయితే దీనిపై ధనుష్ నుంచి కానీ, ఇళయరాజా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. దీని గురించి మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మరిరానున్న రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.