లేటెస్ట్‌ హార్రర్ సినిమా 'పిండం' ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను భయంతో విణికించిన సినిమా 'పిండం' ది స్కేరియెస్ట్‌ ఫిల్మ్‌ ఎవర్ అనే ట్యాగ్‌ లైన్‌తో వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 7:45 AM IST
horror movie, pindam, ott streaming,   aha,

లేటెస్ట్‌ హార్రర్ సినిమా 'పిండం' ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ 

లవ్‌ స్టోరీస్‌.. యాక్షన్‌ సినిమాలు ఇలా ఎన్ని వచ్చిన హార్రర్‌ సినిమాలకు ఉండే ప్రత్యేకతే వేరు. మంచి స్టోరీతో భయపెట్టే సీన్లు ఉంటే చాలు ఆ సినిమా హిట్టే. అయితే.. గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను భయంతో విణికించిన సినిమా 'పిండం' ది స్కేరియెస్ట్‌ ఫిల్మ్‌ ఎవర్ అనే ట్యాగ్‌ లైన్‌తో వచ్చింది. సాయి కిరణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలై ఫరవాలేదనిపించింది. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకులను మరోసారి భయపెట్టబోతుంది.

ఈ మూవీలో శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రదాన పాత్రల్లో కనిపించారు. 2023లో విడుదలైన ది బెస్ట్‌ హార్రర్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ మూవీ. విడుదలకు ముందే విభిన్నంగా ప్రమోషన్స్‌ చేస్తూ సినిమాపై ఆతృతను పెంచారు మేకర్స్. ఈ సినిమాను గర్భిణీలు, చిన్నారులు చూడొద్దంటూ మూవీ విడుదల కాకముందే హెచ్చరించారు. దాంతో.. ఈ సినిమాపై అందర్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలేముంది సినిమాలో అని కచ్చితంగా చూడాలనే ఆలోచనను కలిగించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్‌ చేశారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సినిమాను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా.. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని దాని చుట్టూ ఓ కల్పిత కథాంశం అల్లుకుని ఈ సినిమాను రూపొందించారు. ‘దియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఖుషి రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.


Next Story