హాలీవుడ్‌ టైటానిక్‌, అవతార్‌ చిత్రాల నిర్మాత కన్నుమూత

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. టైటానిక్‌, అవతార్‌ యూనివర్సిల్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు నిర్మాతగా ఉన్న జోన్‌ లండౌ (63) ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 5:05 AM GMT
hollywood,  producer, Jon Landau,  dead,

హాలీవుడ్‌ టైటానిక్‌, అవతార్‌ చిత్రాల నిర్మాత కన్నుమూత 

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. టైటానిక్‌, అవతార్‌ యూనివర్సిల్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు నిర్మాతగా ఉన్న జోన్‌ లండౌ (63) ప్రాణాలు కోల్ఓయారు. ఆయన గతం కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జోన్‌ లాండౌ తుదిశ్వాస విడిచారు. యూనివర్సల్ బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన జోన్ లాండౌ చనిపోవడంతో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

జోన్‌ లాండౌ దర్శకుడు కామెరూన్‌తో కలిసి ప్రస్తుతం అవతార్ సినిమాల ఫ్రాంచైజీ చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ఇప్టపి వరకు జోన్‌ లాండౌ కెరియర్‌లో 8 సినిమాలను నిర్మించారు. రెండు సినిమాలకు సహాయ నిర్మాతగా ఉన్నారు.ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1980లో ప్రొడక్షన్ హైహౌస్‌ను ప్రారంభించారు. మొదటగా దర్శకుడు కామెరూన్‌తో కలిసి టైటానిక్‌ చిత్రాన్ని నిర్మించాడు. దాంతో.. విశ్వవ్యాప్తంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డులు, గుర్తింపును పొందారు. అంతేకాదు.. 14 ఆస్కార్‌ నామినేషన్స్‌ రాగా.. 11 అవార్డులను గెలుచుకుంది టైటానిక్‌ మూవీ. ఎన్నడూ లేని విధంగా రికార్డులను క్రియేట్ చేసింది. ఆ తర్వాత జోన్‌ నిర్మాణంలోనే వచ్చిన అవతార్‌ కూడా కొత్త రికార్డులను అందుకుంది. జోన్‌ లాండౌ చివరగా నిర్మించిన అవతార్‌ సిరీస్‌లో మూడో భాగం 2026లో వస్తుంది. నాల్గో భాగం 2030లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story