ఇలాంటి వారిని చూస్తే అసహ్యంగా ఉంది: త్రిష

తాజాగా హీరోయిన త్రిష సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 7:50 PM IST
heroine trisha, viral tweet, political leader, comments,

 ఇలాంటి వారిని చూస్తే అసహ్యంగా ఉంది: త్రిష 

హీరోయిన్ త్రిష రీఎంట్రీ తర్వాత గతేడాది వచ్చిన లియో సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టారు. అయితే.. ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించిన మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ తారలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి కామెంట్స్ త్రిషూపై ఎలా చేస్తారని మండిపడుతున్నారు. ఈ సందర్భంలో ఏవీ రాజును అరెస్ట్ చేయాలంటూ దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. త్రిష గురించి ఏవీ రాజు మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో త్రిషకు అందరూ అండగా నిలుస్తున్నారు.

కాగా.. తాజాగా హీరోయిన త్రిష సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఫేమస్ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతారా అన్‌నారు. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యంగా ఉందన్నారు త్రిష. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. తమ లీగల్ డిపార్ట్‌మెంట్‌ తదుపరి చర్యలు తీసుకుంటుందని ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది.



Next Story