హీరోయిన్‌ రష్మిక మందన్న అరుదైన ఘనత

రష్మికకు అరుదైన గౌరవం లభించింది.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 4:00 PM GMT
heroine rashmika, forbes india, magazine,

హీరోయిన్‌ రష్మిక మందన్న అరుదైన ఘనత

హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈమె రాణిస్తోంది. ఇటీవల విడుదలైన యానిమల్ మూవీతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక అంతకు ముందు పుష్ప సినిమా ద్వారా నేషనల్‌ క్రష్‌గా మారిపోయిన రష్మిక.. యూత్‌ను తెగ అట్రాక్ట్‌ చేస్తుంది. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రష్మికకు అరుదైన గౌరవం లభించింది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన 'ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30' జాబితాలో ఆమె స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిబ కనబరిచిన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసులోపు ఉన్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను కూడా తాజాగా విడుదల చేసింది.

తాజాగా విడుదలైన జాబితాలో యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజసేవ, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ సహా పలు రంగాల్లో విశేషంగా పనిచేస్తున్న వారిని గుర్తించి ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హీరోయిన్ రష్మిక అగ్రస్థానంలో నిలవడం విశేషం. సోషల్ మీడియా వేదికగా రష్మిక మందన్న ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చిన తన ఫోటోని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మేరకు తనను ఆదరించిన ప్రేక్షకుల అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. రష్మిక ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తోంది. ఇప్పటికే పుష్ప పార్ట్‌1 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండోపార్ట్‌ను అంతకు మించి ఉండేలా చూస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.


Next Story