పేద విద్యార్థులకు స్వయంగా చెప్పులు తొడిగిన హీరోయిన్
ఇటీవల హీరోయిన్ మాళవిక స్కూల్‌లో చదువుతున్న పేద విద్యార్థులకు చెప్పులు అందజేశారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:00 PM ISTపేద విద్యార్థులకు స్వయంగా చెప్పులు తొడిగిన హీరోయిన్
సెలబ్రిటీలు చాలా మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అంతేకాదు.. అభిమాన స్టార్లను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పలువురు సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అయితే.. ఇటీవల హీరోయిన్ మాళవిక స్కూల్‌లో చదువుతున్న పేద విద్యార్థులకు చెప్పులు అందజేశారు. ఊరికే ఇవ్వకుండా స్వయంగా ఆమె చేతులతో విద్యార్థులకు తొడిగించారు. వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ మాళవిక శర్మ తెలుగులో నేలటికెట్, రెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఓ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ప్రభుత్వ పాఠశాలలో చెప్పులు లేని వారికి, పేద పిల్లలకు మాళవిక శర్మ చెప్పులు అందించారు. స్వయంగా ఆమె తన చేతులుతో చెప్పులు తొడుగుతూ.. నవ్వుతూ పలకరించారు. ఆ తర్వాత దుస్తులను కూడా అందించినట్లు తెలిపారు మాళవిక శర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాళవిక శర్మను తెగ పొడుగుతున్నారు.
దేవ్ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సుమారు 40 పాఠశాలల విద్యార్థులకు అండగా నిలుస్తోందని మాళవిక శర్మ తెలిపారు. ఇటీవల తాను బస చేసిన దేవ్ శ్రీ దేవ్‌గఢ్ బోటిక్ హోమ్ స్టే యజమాని శ్రీ శత్రుంజయ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అతను ఎప్పట్నుంచో స్థానిక పాఠశాలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. అతని కుటుంబం కూడా ఇందులో పాల్గొంటుందని అన్నారు. ప్రతి ఏడాది పేద పిల్లల అవసరాలను తీరుస్తున్నట్లు చెప్పారు. దాంతో.. తాను కూడా తన వంతు సాయం చేశానని మాళవిక శర్మ చెప్పారు. విద్యార్థులకు దుస్తులు, పాఠశాల సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలకు సాయం చేసేందుకు వారి సోషల్ మీడియ అకౌంట్‌లోని నంబర్‌కు సంప్రదించవచ్చని కోరారు. ఒక హీరోయిన్, లాయర్ అయ్యి ఉండి అలా పిల్లలకు చేతులతో చెప్పులు తొడగటం.. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.