ఆ హీరోయిన్‌తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్

హీరో విశాల్‌తో హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌ పెళ్లి జరిగిపోయిందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 12:23 PM IST
Hero Vishal, Clarity,  Marriage, Rumours,

 ఆ హీరోయిన్‌తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్

హీరో విశాల్‌ తెలుగు వాడే అయినా.. కోలీవుడ్‌లో బిజీ హీరోగా పేరు పొందారు. అక్కడ వరుస సినిమాలు చేస్తుంటారు. అయితే.. విశాల్‌కు కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. దాంతో.. ఆయన సినిమాలు అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్‌ అవుతుంటాయి. అయితే.. హీరో విశాల్‌ తరచూ ఏదో ఒక కాంట్రవర్శీలో ఉంటారు. కానీ.. అతను పెద్దగా దేనిపై స్పందించరు. ఆ మధ్య వరలక్ష్మి శరత్‌ కుమార్‌ విషయంలో విశాల్‌ ప్రేమాయణం ఏమైందో అందరికీ తెలిసిందే. తర్వాత ఏం లేదు అనేలా.. ఎవరి దారి వారిదే అన్నట్లు విడిపోయారు. ఇద్దరు వారివారి సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ అయిపోయారు. కాగా.. తాజాగా విశాల్‌కు సంబంధించి మరో వార్త తెగ వైరల్ అవుతోంది.

హీరో విశాల్‌తో హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌ పెళ్లి జరిగిపోయిందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై విశాల్‌ తరఫున పీఆర్‌ టీమ్‌ వివరణ ఇచ్చినా వార్తలు ఆగలేదు. దాంతో.. చివరకు విశాల్‌ స్పందించక తప్పలేదు. తాజాగా.. ఈ వైరల్ న్యూస్‌ గురించి మాట్లాడిన విశాల్.. మామూలుగా తనపై వచ్చిన ఫేక్‌ న్యూస్‌ గురించి మాట్లాడనని చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో అవి అంతగా పట్టించుకోవాల్సినవి కావని భావిస్తానని చెప్పాడు. కానీ.. ఇప్పుడు తన పెళ్లి లక్ష్మీ మీనన్‌తో జరిగిందనే వార్తలపై మాట్లాడాల్సి వస్తుందని తెలిపాడు. అయితే.. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం అని కొట్టిపారేశాడు విశాల్. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ రూమర్‌పై స్పందించడానికి కారణం కూడా చెప్పాడు విశాల్.

ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టే తాను రియాక్ట్‌ అవ్వాల్సి వచ్చిందని విశాల్ చెప్పాడు. ఆమె నటి అనేది పక్కన బెడితే.. మీరు ఇలాంటి వార్తలతో ఒక అమ్మాయి జీవితంలోకి చొరబడుతున్నారంటూ పేర్కొన్నారు. ఆమె పేరుని నాశనం చేయొద్దని చెప్ఆరు. నేను ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాననేది సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తానే అధికారికంగా తెలియజేస్తానని చెప్పాడు. దయచేసి ఓపిక పట్టాలని.. ఇలాంటి పుకార్లను మరోసారి చేయొద్దని కోరారు. ట్విట్టర్‌ వేదికగా రూమర్స్‌ క్రియేట్ చేస్తున్న వారికి క్లాస్ ఇచ్చారు. దాంతో.. లక్ష్మీ మీనన్‌తో విశాల్‌ పెళ్లి జరగలేదని.. ఇద్దరి మధ్య వివాహ సంబంధం లేదని క్లారిటీ వచ్చింది.

Next Story