'నా కుమార్తెతో పాటే నేనూ చనిపోయా': హీరో విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోని తన కుమార్తె మరణంపై ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 9:45 PM IST
'నా కుమార్తెతో పాటే నేనూ చనిపోయా': హీరో విజయ్ ఆంటోనీ
బిచ్చగాడు సినిమాతో ఫేమ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని ఇంట్లో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని వారి నివాసంలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. విజయ్ ఆంటోని ఈ క్రమంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన కుమార్తెతో పాటే తానూ చనిపోయానని భావోద్వేగం వ్యక్తం చేశారు. అయితే.. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని తన పెద్దకుమార్తె పేరు మీద చేస్తానని.. అలా ఆమెతో కలిసి ఉన్నట్లుగా ఉంటుందని పోస్టు పెట్టారు విజయ్ ఆంటోనీ.
హీరో విజయ్ ఆంటోనీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెడుతూ.. తన పెద్ద కుమార్తె ఎంతో దయగలది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎంతో ధైర్యవంతురాలు అని చెప్పారు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతవంతమైన ప్రదేశానికి తాను వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ తనతోనే మాట్లాడుతోందని విజయ్ ఆంటోని రాసుకొచ్చారు. అయితే.. తన కుమార్తెతో పాటే తనూ చనిపోయానని భావోద్వేగం అయ్యారు. ఇక నుంచి చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని తన పెద్దకుమార్తె పేరుతో నిర్వహిస్తానని విజయ్ ఆంటోనీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
విజయ్ ఆంటోని ట్వీట్ చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు కూడా బాధపడుతున్నారు. కొందరు అయితే ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలని కోరకుంటున్నట్లు కామెంట్లు పెట్టారు. ఇంకొందరు నెటిజన్లు మీ కుమార్తె ఆత్మకు శాంతి కలగలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని.. ధైర్యంగా ఉండండి సార్ అంటూ పలువురు విజయ్ ఆంటోనీకి ధైర్యం చెప్పారు. అయితే.. విజయ్ ఆంటోనీ కుమార్తె ఇంట్లో ఉదయానే ఉరివేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ప్రకటించారు. కాగా.. ఆమె చెన్నైలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. తీవ్రమైన ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
— vijayantony (@vijayantony) September 21, 2023