'కల్కి' రెండో భాగం కోసం వెయిటింగ్: రజనీకాంత్

పాన్‌ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైంది.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 1:45 PM IST
hero rajinikanth,  kalki movie, success,

'కల్కి' రెండో భాగం కోసం వెయిటింగ్: రజనీకాంత్ 

పాన్‌ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని.. కలెక్షన్లలో దూసుకెళ్తుంది. ఈ సినిమా నెక్ట్స్‌ లెవల్‌ లో ఉందంటూ పలువురు సినీ ప్రముఖలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ మరో లోకానికి తీసుకెళ్లాడంటూ కొనియాడుతన్నారు. తాజాగా కల్కి సినిమా గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.

చాలా అరుదుగా సినిమా విషయాలపై రజనీకాంత్ స్పందిస్తుంటారు. అలాంటిది ఆయనే కల్కి బాగుందనీ ప్రశంసలు ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమా అద్భుతంగా ఉందనీ.. నాగ్‌ అశ్విన్ ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని రజనీకాంత్ చెప్పారు. కల్కి సినిమాలో నటించిన వారందరికీ.. పనిచేసినవారికి అభినందనలు తెలిపారు. ఇక కల్కి సినిమా రెండో భాగం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు రజనీకాంత్. ఈ పోస్టుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్ రిప్లై ఇస్తూ.. మాటలు రావడం లేదనంటూ రాసుకొచ్చారు. టీమ్‌ అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. నాగ్‌ అశ్విన్ మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అంటూ చెప్పారు. అమతాబ్‌ అసలైన మాస్‌ హీరో.. మీ నటనతో మరోసారి ఆశ్చర్యపరిచారంటూ రాసుకొచ్చారు. పార్ట్‌-2 కమల్‌ హాసన్‌ను చూడటం కోసం వేచి చూస్తున్నా అంటూ రాసుకొచ్చారు. ప్రభాస్‌ మరోసారి సత్తా చాటాడని అన్నారు. దీపిక అద్భుతంగా ఉందనీ.. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారని కింగ్ నాగార్జున అన్నారు.

Next Story