ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనబడుటలేదు
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ అకౌంట్ కోసం వెతికితే కనబడం లేదు. దాంతో.. ఆయన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 5:15 PM ISTప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనబడుటలేదు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగానే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఈయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. అయితే.. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాను తక్కువగానే యూజ్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లను ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతుంటారు. అయితే.. తాజాగా ఈ పాన్ ఇండియా హీరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలుస్తోంది. ఇన్‌స్టాలో ప్రభాస్ అకౌంట్ కోసం చూస్తే.. ఈ పేజీ అందుబాటులో లేదు అని చూపిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ అకౌంట్ కోసం వెతికితే కనబడం లేదు. దాంతో.. ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అకౌంట్ కోసం సెర్చ్ చేస్తే ఫ్యాన్ మేడ్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి తప్ప.. అఫీషియల్ అకౌంట్ మాత్రం కనిపించట్లేదు. హ్యాక్ అయ్యిన అకౌంట్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభాస్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జులై నెలలో ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు 'మనుషులు దురదృష్టంతులు' అంటూ హ్యాకర్లు వీడియో షేర్ చేశారు. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్త చేశారు. అప్పుడు తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ప్రభాస్ కూడా ప్రకటన చేశాడు. మరోసారి డార్లింగ్ హీరో ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అవ్వడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా 'సలార్' పార్ట్ -1 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంట్లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఇది కాకుండా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ 'కల్కీ 2898 ఏడీ ' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.