రెండు వారాల ముందే.. 'దేవర' కొత్త రిలీజ్ డేట్ !

టాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న మరో మూవీ దేవర.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 7:15 PM IST
ntr, devara movie,  new release date ,

 రెండు వారాల ముందే.. 'దేవర' కొత్త రిలీజ్ డేట్ !

టాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న మరో మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌.. పలు పోస్టర్లు దేవర సినిమాపై ఆసక్తిని పెంచాయి. కచ్చితంగా ఎన్టీఆర్ మరో హిట్‌ ఖాతాలో వేసుకుంటారని అంటున్నారు. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాపై అభిమానుల్లో భారీ అంచనా ఉంది.

దేవర సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నామని డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే చెప్పారు. మొదటి పార్ట్‌ కోసం ప్రేక్షకులు ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు. దేవర సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఇదులో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సముద్రం నేపథ్యంలో సాగనున్న కథతో తెరకెక్కుతోంది దేవర మూవీ. ఇప్పటికే చిత్ర యూనిట్‌ దేవర సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తామని ముందు చెప్పారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మారింది.

అక్టోబర్ 10వ తేదీన తమిళం నుంచి రజనీకాంత్‌ వేటగాడు రిలీజ్‌ అవుతుందని.. అందుకే తాము ఇంకాస్త ముందుగానే విడుదల చేస్తున్నట్లు దేవర చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు వారాల ముందే సినిమాను విడుదల చేస్తామని చెప్పింది. సెప్టెబర్ 27వ తేదీన దేవర వస్తున్నట్లు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ'ని కూడా అదే రోజు విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. మరి మున్ముందు విడుదల తేదీలు ఏమైనా మారుతాయో చూడాలి.

Next Story