ఎన్టీఆర్ బర్త్‌డే.. 'దేవర' నుంచి కొత్త పోస్టర్‌ విడుదల

సోమవారం మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 11:37 AM IST
ntr, birthday, devara movie, new poster,

ఎన్టీఆర్ బర్త్‌డే.. 'దేవర' నుంచి కొత్త పోస్టర్‌ విడుదల 

సోమవారం మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతున్నారు. ఆయన రాబోతున్న సినిమా ప్రాజెక్టులన్నీ సూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ దేవర. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కొంతకాలం ముందు విడుదలైన టీజర్‌.. పోస్టర్లు.. అందులో ఉండబోతున్న యాక్షన్ సీన్స్‌ గురించి తెగ చర్చ జరిగింది. అందుకే ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా దేవర చితర యూనిట్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చింది. బర్త్‌డే సందర్భంగా దేవర మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్ ఫియర్ సాంగ్‌ను విడుదల చేశారు. తాజాగా ఇదే మూవీ నుంచి తారక్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో సముద్రం ఒడ్డున కూర్చొని ఎన్టీఆర్ కొందరు పిల్లలతో ముచ్చట పెడుతున్నట్లుగా ఉంది. అంతకుముందు విడుదలైన టీజర్‌లో భారీ డైలాగులతో పాటు.. అదిరిపోయే యాక్షన్ సీన్స్‌ను చూశాం. మరోసారి ఇప్పుడు పిల్లలతో మాట్లాడుతున్న పోస్టర్‌ కూడా రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

కాగా.. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం విహిస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ దేవర సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతుంది. సైఫ్‌ అలీఖాన్‌ దేవర మూవీలో విలన్‌గా కనిపించబోతున్నారు. కాగా.. ఈ దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తీస్తున్నాడు. ఫస్ట్‌ పార్ట్ 2024 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు.


Next Story