కల్కి మూవీలోని 'బుజ్జి'ని డ్రైవ్ చేసి షాకైన నాగచైతన్య
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా 'కల్కి 2898 ఏడీ'.
By Srikanth Gundamalla
కల్కి మూవీలోని 'బుజ్జి'ని డ్రైవ్ చేసి షాకైన నాగచైతన్య
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన ఈ మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని ఊహించుకున్నారు.. ఆ దిశలోనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమా కొత్తగా ఉండాలనీ.. పెద్ద హిట్‌గా నిలవాలని ఎన్నో ప్రయోగాలు చేశాడు డైరెక్టర్. దేశంలోని ఆటో మొబైల్ రంగంలోని ది బెస్ట్ టీమ్‌ను సంప్రదించి స్పెషల్ కారును కూడా రెడీ చేయించాడు. కల్కి మూవీలో హీరో ప్రభాస్ వాహనం ఇదే. ఇక సినిమాలో ఈ వెహికల్‌కు ఒక పేరు కూడా ఉంది. అదే బుజ్జి. ఇటీవల బుజ్జికి సంబంధించిన టీజర్ కూడా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ వెహికల్‌కు ఎంత ప్రాధాన్యత ఉందనేది. అలాగే.. బుజ్జికి వాయిస్ ఓవర్ హీరోయిన్ కీర్తి సురేశ్ అందించారు.
ఇక బుజ్జిని పరిచయం చేసేందుకే గత బుధవారం రోజు గ్రాండ్‌గా కల్కి చిత్ర యూనిట్ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేస్తూ.. మాస్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బుజ్జిని టాలీవుడ్ మరో స్టార్ హీరో కూడా డ్రైవ్ చేశాడు.
అక్కినేని నాగచైతన్య కూడా బుజ్జిని డ్రైవ్ చేశాడు. చైతూకి కొత్త కొత్త వాహనాలను నడపడం అంటే ఇష్టమని మనందరికీ తెలిసిందే. ఆయన వద్ద సూపర్ కార్ కలెక్షన్లు ఉంటాయి. అంతేకాదు.. ఆయన మంచి రేసర్ కూడా. స్పోర్ట్స్ బైక్‌లు.. స్పోర్ట్స్ కార్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇక చైతూకి బుజ్జి బాగా నచ్చినట్లుంది. దాంతో.. ఆయన టెస్ట్ డ్రైవ్ చేశారు. బుజ్జిని చైతన్య నడిపిన వీడియోలు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. బుజ్జిని ఫస్ట్‌టైమ్ నేరుగా చూసిన చై షాక్ అయ్యాడు. ఇంజీనిరింగ్స్‌లో ఉన్న అన్ని రూల్స్‌ను బ్రేక్ చేశారనీ.. ఇలాంటిది తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ మేరకు చైతన్య చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. నాగచైతన్య ట్వీట్ చేస్తూ.. దీన్ని నమ్మకలేకపోతున్నానని అన్నారు. అద్బుతంగా ఉందనీ.. విజన్‌ను రియాల్టీలోకి తెచ్చేందుకు కష్టపడ్డ టీమ్‌కు కంగ్రాట్ చెప్పారు. నిజంగా బుజ్జి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అంటూ చెప్పారు. బుజ్జితో టైమ్ స్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు నాగ చైతన్య.
This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl
— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024
ప్రస్తుతం బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. ప్రభాస్ మూవీ కల్కిలో బుజ్జి ఎలాంటి విన్యాసాలు చేయబోతుంది..? హీరో ఎలా క్రియేట్ చేస్తాడు? కథలో ఎలాంటి పాత్ర పోషించబోతుందని సినీ ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. కల్కి మూవీని జూన్ 27న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.