మహేశ్‌బాబుతో సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన జక్కన్న

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

By Srikanth Gundamalla
Published on : 19 March 2024 1:01 PM IST

hero mahesh babu, director ss rajamouli,  movie,

మహేశ్‌బాబుతో సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన జక్కన్న 

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తారని సమాచారం. కాగా.. ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ మహేశ్‌బాబుతో సినిమా గురించి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసి.. సత్తా చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అలాంటి డైరెక్టర్‌తో సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు సినిమా అంటే అభిమానులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అంతేకాదు.. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌ లో ఉన్న జక్కన్న అక్కడి మీడియాతో తన తదుపరి సినిమా ప్రాజెక్టుల విషయాల గురించి పంచుకున్నారు. SSMB29 సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈ మేరకు మహేశ్‌తో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. SSMB29 ప్రాజెక్టుకు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశామన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించబోతున్న మహేశ్‌బాబు తెలుగు హీరో అనీ.. చాలా అందంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు జక్కన్న. అంతేకాదు.. బహుషా జపాన్‌లో ఉండే వారికి కూడా మహేశ్‌బాబు తెలిసే ఉంటారని చెప్పగా.. అందరూ కేకలు వేశారు. ఇక వీలైనంత త్వరగానే ఈ సినిమాను పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తామని జక్కన్న తెలిపారు. అప్పుడు మహేశ్‌బాబుని కూడా జపాన్‌కు తీసుకొస్తానని మాటిచ్చారు. తాజాగా జక్కన్న చేసిన కామెంట్స్‌తో మహేశ్‌బాబు ఫ్యాన్సే కాదు.. టాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story