ఎంతో గర్వపడుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పాఠశాల విద్యను పూర్తి చేశాడు.
By M.S.R Published on 27 May 2024 12:15 PM ISTఎంతో గర్వపడుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పాఠశాల విద్యను పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని పటాన్‌చెరు సమీపంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్‌హెచ్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అందుకు సంబంధించిన వేడుకలు ఇటీవలే నిర్వహించారు.
మహేష్ బాబు తన కుమారుడు గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. “నాకు ఈరోజు ఎంతో గర్వంగా ఉంది! గ్రాడ్యుయేషన్ చేసినందుకు అభినందనలు. ఈ తదుపరి అధ్యాయం నువ్వే వ్రాయవలసి ఉంది.. గతంలో కంటే ప్రకాశవంతంగా వెలిగిపోతావని నాకు తెలుసు. మీ కలలను వెంబడించడానికి ప్రయత్నించు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ రోజు నేను తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను” అని మహేష్ బాబు రాసుకొచ్చారు. గౌతమ్ ఘట్టమనేని తన విద్యను న్యూయార్క్‌లో కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో కూడా నటించాడు. గౌతమ్ తల్లి నమ్రత కూడా కుమారుడికి కంగ్రాట్స్ చెప్పింది. ఇక మహేష్ బాబు అభిమానులు గౌతమ్ కు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.