క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫ్యాన్‌తో వీడియో కాల్ మాట్లాడిన జూ.ఎన్టీఆర్

గ్లోబల్‌ స్టార్‌ జూనియర్ ఎన్డీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2024 8:45 PM IST
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫ్యాన్‌తో వీడియో కాల్ మాట్లాడిన జూ.ఎన్టీఆర్

గ్లోబల్‌ స్టార్‌ జూనియర్ ఎన్డీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని యంగ్‌ టైగర్‌ అని పిలుచుకుంటారు. తనని ప్రేమించే అభిమానులు.. వారి కుటుంబాలంటే ఎంతో ఆప్యాయత చూపిస్తుంటారు ఎన్టీఆర్. అయితే.. ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్‌ ఒకరు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. తాను జీవితంలో చివరి దశలో ఉన్నాననీ.. క్యాన్సర్‌తో చనిపోబోతున్నానని తెలుసుకుని తల్లితో ఇలా చెప్పాడు. కనీసం తనని ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర చూసే వరకూ బతికించాలని చెప్పాడు. అయితే.. ఆ తల్లి చెప్పిన విషయం చెప్పారు. ఇక దీనిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ‘ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. ‘దేవర’ చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని తన అభిమానితో చెప్పాడు ఎన్టీఆర్. ‘అన్నా.. మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు’ అని కౌశిక్‌ భావోద్వేగం అయ్యాడు. ‘నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో’ అని తారక్‌ ఆప్యాయతగా మాట్లాడాడు.

ఏపీ రాష్ట్రానికి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు ఎన్టీఆర్‌ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు ‘దేవర’ ) చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పాడు. అయితే.. తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్‌ తల్లి మీడియా ఎదుట కోరారు.



Next Story