ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాయన్' మూవీ.. స్టీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..

తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  16 Aug 2024 1:30 PM IST
hero Dhanush, raayan movie, ott release date,

ఓటీటీలోకి వచ్చేస్తున్న రాయన్ మూవీ.. స్టీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..

తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్‌లో ఆత్రమే కాదు.. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన మూవీ రాయన్. థియేటర్లలో మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో మన తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ కూడా నటించారు. మలయాళం నటుడు కాళిదాస్‌ జయరాం కూడా కీలక పాత్రలో మెరిశాడు. అయితే.. జూలై 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీని చూసినవారంతా ధనుష్ డైరెక్షన్ చాలా బాగుందంటూ పొగిడారు. థియేటర్లలో నెల రోజులు కాకముందే ఓటీటీ విడుదల తేదీ కన్ఫామ్‌ అయ్యింది.

ఈ క్రమంలోనే రాయన్ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఆగ‌ష్టు 23 నుంచి త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ స్టోరీ విష‌యానికి వ‌స్తే.. హీరో సాధారణ వ్యక్తి లా కనిపిస్తాడు. మద్రాస్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ అయిన అతను హోటల్‌లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ‘రాయన్‌’ సినిమా చూడాల్సిందే. ఈ మేరకు మరోసారి ఓటీటీలో భారీ ఎత్తున స్ట్రీమింగ్ అవువ్వబోతుందని రాయన్ మూవీ బృందం అంచనా వేస్తున్నారు.



Next Story