ఏంటీ పుష్ప పార్ట్‌-3 టైటిల్‌ అదేనా?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'పుష్ప' రికార్డులను తిరగరాసింది.

By Srikanth Gundamalla  Published on  28 March 2024 8:45 PM IST
allu arjun, pushpa, part-3 title, director sukumar,

ఏంటీ పుష్ప పార్ట్‌-3 టైటిల్‌ అదేనా? 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'పుష్ప' రికార్డులను తిరగరాసింది. ఇంకెంతో మంది అభిమానులను అల్లు అర్జున్‌కు సంపాదించి పెట్టింది ఈ మూవీ. పుష్ప సినిమా 2021లో రాగా.. దీనికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. కాగా.. మొదటి పార్ట్‌కి గాను హీరో అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డులను అందుకున్నారు. ఇక మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

కాగా.. కొద్దిరోజులుగా పుష్ప సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కథ మూడో పార్ట్‌కు సంబంధించిన న్యూస్‌ సంచలనంగా మారింది. దీని టైటిల్‌ కూడా ఖరారు అయ్యిందని టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం బన్నీ, సుకుమార్‌లు మూడో భాగం స్క్రిప్ట్‌ వర్క్‌పై చర్చలు జరిపారట. మొదటి భాగాన్ని పుష్ప: దిరైజ్‌గా తీయగా.. రెండో భాగాన్ని పుష్ప: ది రూల్‌గా వస్తోంది. ఇక మూడో భాగం పుష్ప: ది రోర్‌ గా తెరకెక్కబోతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మూడో పార్ట్‌ తర్వాత పుష్ప కథను ముగిస్తారట.

కాగా.. పుష్ప పార్ట్‌-3 పై ఇటీవల అల్లు అర్జున్‌ కూడా మాట్లాడారు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. అన్ని అనుకూలంగా ఉంటే పార్ట్‌-3 తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పార్ట్‌-3ని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయనీ.. ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుందని అల్లు అర్జున్‌ వ్యాఖ్యానించారు. ఇక స్వయంగా హీరోనే పార్ట్‌-3 గురించి మాట్లాడటంతో అభిమానులు, సినిమా ప్రేక్షకులు పుష్ప-3 కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. ఇక పుష్ప-2 సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. పుష్ప: ది రూల్‌ తర్వాత సుకుమార్ రామ్‌చరణ్‌తో మరో ప్రాజెక్టు చేస్తారు. ఆ తర్వాత పుష్ప పార్ట్‌-3 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story