విషాదం.. 'హ్యారీపోటర్‌' నటుడు మృతి

హ్యారీపోటర్‌ సినిమాల్లో డంబెల్‌ డోర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన నటుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 8:30 PM IST
Harry potter, Movies, Actor Death, Sir Michael Gambon,

విషాదం.. 'హ్యారీపోటర్‌' నటుడు మృతి

హ్యారీపోటర్‌ సినిమాల గురించి ఇప్పుడున్న వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 1990ల్లో హ్యారీపోటర్‌ సీక్వెల్‌ సినిమాలు ఓ రేంజ్‌లో నడిచాయి. కలెక్షన్లలో దూసుకుపోయాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ ఈ సినిమాలను ఇష్టపడే వారు. థియేటర్లలోనే కాదు టీవీల్లో వచ్చినా కూడా వదిలేవారు కాదు. వందల కోట్లు కలెక్షన్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాల్లో నటించిన వారు కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మంచి గుర్తింపు లభించింది. వారి క్యారెక్టర్‌ పేరుతోనే పిలిచేవారంటే అర్థం చేసుకోండి. అలా హ్యారీపోటర్‌ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన ఓ నటుడు తుది శ్వాస విడిచారు.

హ్యారీపోటర్‌ సినిమాల్లో డంబెల్‌ డోర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన నటుడి అసలు పేరు సర్‌ మైకేలే గాంబన్. ఐర్లాండ్‌లో పుట్టిన గాంబన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్ వచ్చాడు. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యాడు. కాస్త వయసు వచ్చిన తర్వాత థియేటర్, టీవీ, సినిమాల్లో పలు పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. హ్యారీపోటర్‌ తొలి రెండు భాగాల్లో డంబెల్‌ డోర్ పాత్రలో నటించిన రిచర్డ్‌ హ్యారీస్‌ చనిపోయాడు. దాంతో.. ఆ పాత్రలో గాంబన్‌ను తీసుకున్నారు. అలా దాదాపు హ్యారీపోటర్‌ ఫ్రాంచైజీలోని 6 సినిమాల్లో డంబెల్‌ డోర్ పాత్రలో నటించాడు గాంబన్. ప్రస్తుతం గాంబన్ ఏజ్‌ 82 ఏళ్లు.

సర్‌ మైకేలే గాంబన్ గత కొన్నాళ్లుగా న్యూమోనియా వ్యాధితో బాదపడుతున్నారు. తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ కుటుంబ సభ్యుల కళ్ల ముందే ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న హారీపోటర్‌ సినిమా అభిమానులు కాస్త ఉద్వేగానికి గురి అవుతున్నారు.

Next Story