మాట నిలబెట్టుకున్న 'హనుమాన్' టీమ్.. అయోధ్యకు రూ.2.66 కోట్ల విరాళం

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తీసిన సినిమా 'హనుమాన్‌' సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 7:10 AM GMT
hanuman, movie team, rs.2.66 crore, donation,  ayodhya ,

మాట నిలబెట్టుకున్న 'హనుమాన్' టీమ్.. అయోధ్యకు రూ.2.66 కోట్ల విరాళం

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తీసిన సినిమా 'హనుమాన్‌' సంచలనంగా మారింది. తక్కువ బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా తీశాడంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు తెగపొగిడేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది ఈ మూవీ. అయితే..తెలుగుతో పాటు ఇతర భాషల్‌లో రూపొందిన హనుమాన్‌ మూవీ పాన్‌ఇండియాగా విడుదలైంది. కాగా.. హనుమాన్‌ సినిమా విడుదలకు ముందే మూవీ టీమ్‌ ఒక మాట చెప్పింది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో మాట్లాడుతూ.. ప్రతి టికెట్‌పై రూ. చొప్పున అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఇచ్చిన మాటను హనుమాన్ చిత్ర యూనిట్ నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. హనుమాన్‌ ఫర్ శ్రీరామ్‌ అని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. చిత్ర బృందంతో పాటు నిర్మాత నిరంజన్‌రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇంతపెద్ద విజయం సాధించిన ఈ మూవీ టీమ్‌ ఇచ్చిన మాటను మర్చిపోకుండా రెండు కోట్లకు పైగా రూపాయలను అయోధ్యకు ఇవ్వడం మంచి విషయమని చెబుతున్నారు.

అయితే.. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి మొదలుకొని.. ఈ సినిమా చూసిన ప్రతిఒక్క స్టార్‌ అద్భుతమంటూ పొగిడిస్తున్నారు. ఇటీవల సినిమా చూసిన సమంత సినిమాపై మంచి రివ్యూ ఇవ్వగా.. తాజాగా నాగచైతన్య కూడా హనుమాన్‌ టీమ్‌ను పొగుడుతూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. హనుమాన్‌ వంటి సినిమా తీసి బ్లాక్‌బస్టర్ అందుకు ప్రశాంత్ వర్మకు అభినందనలు తెలిపాడు. కథ.. దాన్ని స్క్రీన్‌పైకి తీసుకొచ్చిన తీరు అద్భుతంగా ఉందని చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపు నీ యూనివర్స్‌లో లీనమయ్యానని చెప్పాడు. ఇక తేజ సజ్జా అద్బుతంగా నటించాడని పేర్కొన్నాడు.

హనుమాన్‌ సినిమాలో తేజ సజ్జా పక్కన హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక కోటి అనే వానరం పాత్రకు హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగిన ఈ కథ అద్భుతంగా ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.




Next Story