ముందుగానే ఓటీటీలోకి నేచురల్ స్టార్‌ నాని 'హాయ్‌ నాన్న'?

హాయ్ నాన్న సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో విడుదల అవుతున్నట్లు సమాచారం.

By Srikanth Gundamalla  Published on  29 Dec 2023 12:00 PM IST
hai nanna movie, hero nani, ott streaming ,

ముందుగానే ఓటీటీలోకి నేచురల్ స్టార్‌ నాని 'హాయ్‌ నాన్న'?

డిసెంబర్‌లో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. వాటిల్లో 'సలార్'.. 'యానిమల్' ఉన్నాయి. అంతేకాదు.. నేచురల్‌ స్టార్ నానీ నటించిన మూవీ 'హాయ్‌ నాన్న' కూడా ఇదే నెలలో విడుదలైంది. ముందుగా ఈ సినిమాపై మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. థియేటర్లలో మాత్రం నడుస్తూనే ఉంది. థియేటర్లలో విడుదలై 20 రోజులు అవుతున్నా.. జనాలు ఇంకా వెళ్లి ఈ క్లాస్‌ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం వేచి చూస్తున్న అభిమానులు ఉన్నారు. అయితే.. వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.

హాయ్ నాన్న సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో విడుదల అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. హాయ్‌నాన్న సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు. నేచురల్‌ స్టార్ నాని కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో దసరా మూవీతో మాస్‌ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు హాయ్‌ నాన్న సినిమాతో తండ్రి సెంటిమెంట్‌తో మూవీ ప్రేక్షకులను అలరించాడు. అయితే.. హాయ్‌నాన్న విడుదలైన రెండుమూడు రోజుల పాటు సినిమాపై మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఎక్కువ రోజులు థియేటర్లలో ఉండటం కష్టమని అన్నారు. కానీ దాదాపు 20 రోజులు దాటినా.. ఇప్పటికీ థియేటర్లలో నడుస్తూనే ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌లో హాయ్‌ నాన్న సినిమా సంక్రాంతి తర్వాత వస్తుందని అంతా అనుకున్నారు. జనవరి 19న లేదా 26వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. ఇప్పుడు ప్లాన్‌ మారిందని సమాచారం. జనవరి 5వ తేదీనే అంటే వచ్చే వారమే హాయ్‌నాన్న సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇది నిజమైతే నెలలోపే ఓటీటీలోకి వచ్చినట్లు అవుతుంది. అయితే.. నెట్‌ఫ్లిక్స్‌.. మూవీ టీమ్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story