ఫస్ట్‌ క్రష్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన హీరో నాని

నాచురల్‌ స్టార్ నాని తన ఫస్ట్‌ క్రష్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2023 7:00 AM GMT
Hai Nanna Movie, Hero Nani,  First Crush,

ఫస్ట్‌ క్రష్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన హీరో నాని

నాచురల్‌ స్టార్ నానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పక్కింటి అబ్బాయిలా ఉంటాడని చెప్తుంటారు. అతని నటన నాచురల్‌గా ఉంటుంది. అయితే.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. అలానే నాని కూడా పడ్డాడట. తన ఫస్ట్‌ క్రష్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు నాని. ప్రస్తుతం ఈ నాచురల్ స్టార్‌ 'హాయ్‌ నాన్న' సినిమాలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేడియో జాకీలతో కలిసి చిట్‌చాట్ నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే ఫస్ట్‌ క్రష్ గురించి మాట్లాడారు.

ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందని చెప్పిన నాని.. తాను ప్రేమలో మూడో తరగతిలోనే పడ్డానని చెప్పాడు. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చిందని చెప్పాడు. తాను ఆకులు చుట్టుకుని నిలబడి ఉండగా.. ఆ సమయంలో సోనీని చూసి మొదటి చూపులో నచ్చిందని చెప్పుకొచ్చాడు నాని. అయితే.. ఇప్పుడు అమ్మాయి కనిపిస్తే మాత్రం..ప్రస్తుతం మంచి డ్రెస్‌ వేసుకున్నందున పలకరిస్తానని నవ్వులు పూయించాడు నాని. అలాగే ప్రజెంట్‌ క్రష్‌ గురించి కూడా మాట్లాడాడు. ప్రస్తుతం క్రష్ అంటే కియారా ఖన్నా (హయ్‌ నాన్న సినిమాలోని చైల్డ్‌ ఆర్టిస్టు) అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఒకరోజు కియారా ఖన్నా చక్కగా రెడీ అయ్యి సెట్‌కు వచ్చిందనీ.. భలే ముచ్చటగా అనిపించిందని నాని అన్నాడు. తాను తన వయసులో ఉండిఉంటే మాత్రం మనసు పారేసుకునే వాడిని అని.. అందుకే ఆ పాపే తన క్రష్‌ అని నాని చెప్పాడు.

శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు 'హాయ్‌ నాన్న' సినిమాను తెరకెక్కించారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిండీ భాషల్లో సినిమా విడుదల కానుంది. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబర్ 21న ప్రేక్షకుల మందుకు రానుంది ఈ సినిమా.

Next Story