గుంటూరు కారం కాంట్రవర్సీపై నోరు విప్పిన థమన్
దాని గురించి అంత చర్చ అవసరమా అంటూ గుంటూరు కారం కాంట్రవర్సీపై నోరు విప్పిన థమన్
By Bhavana Sharma
గుంటూరు కారం కాంట్రవర్సీపై నోరు విప్పిన థమన్
ప్రతి ఏడాది దాదాపు 5 నుండి 6 సినిమాలకు సంగీతాన్ని చేకూరుస్తూ ఇప్పుడు బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన థమన్, ప్రస్తుతం త్వరలోనే విడుదల కాబోతున్న బ్రో సినిమా యొక్క మ్యూజిక్ తో బిజీగా ఉన్నాడు. జూలై 28 కి విడుదల కాబోతున్న ఈ సినిమా ఒక ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడాడు థమన్.
పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికే రెండు సినిమాలకు పని చేసిన అతను, తన మూడవ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకున్నాడు. "పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఇప్పటివరకు మాస్ మ్యూజిక్ అందించాను. కానీ బ్రో సినిమాలో మాత్రం ఎక్కడా కూడా మాస్ పాటలకు స్కోప్ లేదు. కాలం యొక్క ప్రాముఖ్యతను తెలిపే పాట మరియు కొన్ని శ్లోకాలను కలిపి చేసిన ఒక పాట ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాలకు పని చేయడం ఎప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటూ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇప్పటికే బ్రో సినిమాపై అంచనాలు భారీగా ఉండడం మాత్రమే కాకుండా, థమన్ పనిచేస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించి కూడా అతనిపై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. సినిమా నుండి పూర్తిగా థమన్ ను తొలగించాలన్న వార్తలు ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు కు మరియు త్రివిక్రమ్ కు థమన్ సంగీతం అస్సలు నచ్చడం లేదన్న వార్త తెగ వినిపించింది.
అయితే ఇదే తరుణంలో ఆ సినిమాకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది అని ప్రశ్నించగా తమ ఇలా చెప్పారు. “ఆరు నెలల నుంచి దాని మీద పని చేస్తున్నాం. బయట జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరంలేదు.”
అయితే అతను చెప్పిన మాటల ద్వారా ఇప్పటికీ తన గుంటూరు కారం సినిమాలు భాగమేనని తెలుస్తోంది.