'గుంటూరు కారం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్.. ఎక్కడంటే..!

గుంటూరు కారం సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాటలు, ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి హైప్‌ను పెంచాయి.

By Srikanth Gundamalla  Published on  8 Jan 2024 2:35 PM IST
guntur karam, movie, pre release event, mahesh babu,

'గుంటూరు కారం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్.. ఎక్కడంటే..!

సంక్రాంతికి సినిమా సందడి మొదలుకాబోతుంది. వీటిల్లో ముఖ్యంగా అందరూ ఎదురుచూస్తోన్న సినిమా 'గుంటూరు కారం'. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తుండటంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రేక్షకులంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు.. ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేశ్, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ఇది. అయితే.. కొద్దిరోజులుగా గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

గుంటూరు కారం సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాటలు, ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి హైప్‌ను పెంచాయి. దానికి తోడు చిత్ర యూనిట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేసే విషయం తాము చూసుకుంటామనీ.. ఇక సెలబ్రేషన్స్‌ అంశం అభిమానులే చూసుకోవాలంటూ నిర్మాత చెప్పారు. కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తుంది. ఈ పాటను థియేటర్లలో చూస్తే అభిమానులకు పూనకాలే అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ జనవరి 12న విడుదల చేస్తున్నారు.

ఇక ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ విషయానికి వస్తే.. ఈ నెల 6వ తేదీనే హైదరాబాద్ లో నిర్వహించాలని ప్లాన్ చేసింది గుంటూరు కారం చిత్ర యూనిట్. కానీ.. అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా ఈవెంట్‌ నిర్వహణకు లైన్‌క్లియర్ అయ్యింది. జనవరి 9న అంటే రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్ మొదలుకాబోతుంది. గుంటూరులోని నంబూర్‌ ఎక్స్‌రోడ్స్‌ వద్ద భారతి పెట్రోల్‌ బంక్‌ పక్కన ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మహేశ్‌బాబును నేరుగా గుంటూరు ప్రజలు చూసే అవకాశం ఉంది.

ఇక శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్‌ రాధకృష్ణ గుంటూరు కారం సినిమాను నిర్మించారు. ఈ మూవీలో మహేశ్‌ సరసన ట్రెండింగ్ హీరోయిన్‌ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. అలాగే ఈ మూవీలో ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటులు కనిపించనున్నారు.

Next Story