'గుంటూరు కారం' మూవీపై ఫ్యాన్స్‌కు గట్టిగా చెప్పిన నాగవంశీ

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. కోడిపందాలు.. కొత్త అలుళ్లతో పాటు.. థియేటర్లలో కొత్త సినిమాల విడుదల అదే రేంజ్‌లో ఉంటుంది.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 5:54 PM IST
guntur karam, movie, mahesh, trivikram, producer naga vamshi,

 'గుంటూరు కారం' మూవీపై ఫ్యాన్స్‌కు గట్టిగా చెప్పిన నాగవంశీ

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. కోడిపందాలు.. కొత్త అలుళ్లతో పాటు.. థియేటర్లలో కొత్త సినిమాల విడుదల అదే రేంజ్‌లో ఉంటుంది. 2024 సంక్రాంతికి కూడా దాదాపు 8 సినిమాల వరకు రేసులో ఉన్నాయి. కొన్ని డబ్బింగ్ చిత్రాలు అయితే.. కొన్ని నేరుగా మనభాషలో వస్తున్నాయి. ముఖ్యంగా అందరి చూపు మాత్రం ఒక్క సినిమావైపే ఉంది. అందే మహేశ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న గుంటూరు కారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు.. టీజర్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్‌ మాత్రం యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది.

జనవరి 12న గుంటూరు కారం సినిమా విడుదల కాబోతుంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్. దాంతో.. ఈ మూవీపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల నటిస్తోంది. గుంటూరు కారం సినిమాపై తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ఒక ట్వీట్‌ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆయన.. ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తామని చెప్పారు. గుంటూరు కారం కంటెంట్ విసయంలో తనకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను బీట్ చేయలేకపోయినా.. వాటికి దగ్గరగా ఉంటాయనే దీమా వ్యక్తం చేశారు నిర్మాత నాగవంశీ.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఒక విషయం కూడా చెప్పారు. 'డియర్‌ సూపర్‌ ఫ్యాన్స్‌.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేమే అదే మాటమీద ఉన్నాం. గుంటూరు కారం చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాదు ఎక్కువ థియేటర్లలో రికార్డు రేంజ్‌లో విడుదల ఉంటుంది. రిలీజ్‌ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అన్నారు నాగవంశీ. మహేశ్, శ్రీలీల కుర్చీమడతపెట్టి సాంగ్‌లో డ్యాన్‌ ఇరగదీశారు. ఇటీవల విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. కాగా.. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమాను భారీగా ఎత్తున విడుదల చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.


Next Story