ముందుగానే ఓటీటీలోకి 'గుంటూరుకారం'.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా..?

సలార్‌నే మహేశ్‌ గుంటూరు కారం సినిమా కూడా ఫాలో అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 11:05 AM IST
guntur kaaram movie, mahesh babu, ott streaming, netflix,

ముందుగానే ఓటీటీలోకి 'గుంటూరుకారం'.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా..?

ప్రభాస్‌ సలార్‌ సినిమా ఓటీటీలోకి సర్‌ప్రైజ్‌గా వచ్చేసింది. అందరూ అనుకున్నదాని కంటే రెండు వారాల ముందుగానే స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే.. సలార్‌నే మహేశ్‌ గుంటూరు కారం సినిమా కూడా ఫాలో అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఓటీటీలోకి మహేశ్‌బాబు గుంటూరు కారం స్ట్రీమింగ్‌ అవ్వనుందని తెలుస్తోంది.

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన సినిమా గుంటూరుకారం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలోకి వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ సినిమా గురించి మిక్స్‌డ్‌ టాక్‌ కూడా వచ్చింది. ఆ టాక్‌ కలెక్షన్లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇప్పటికే గుంటూరుకారం సినిమా రూ.212 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో..మహేశ్‌ మ్యాజిక్‌ మరోసారి రుజువు అయ్యింది. సినిమా కథ ఎలా ఉన్నా.. మహేశ్‌బాబుని చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇప్పటికీ గుంటూరుకారం మూవీకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి.

గుంటూరుకారం మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ సలార్‌ మూవీలాగే గుంటూరు కారం కూడా 28 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరుకారం సినిమా డిజిటిల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీని కోసం సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్రతినిథుల మధ్య భారీ ఒప్పందం జరిగిందని సమాచారం. ఫిబ్రవరి రెండోవారంలోనే గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అయితే ఫిబ్రవరి 9న లేదా 10వ తేదీల్లో గుంటూరుకారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వొచ్చు.


Next Story