పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' సినిమా హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 12:54 PM ISTపెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' సినిమా హీరోయిన్
గత ఏడాది చాలా మంది సినిమా స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. అలాగే ఈ ఏడాది కూడా వరుసగా సినిమా నటులు వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు, కృతి కర్బందా, నటాషా దోషితో పాటు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్యనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే.. తాజాగా మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
గతేడాది విడుదలైన కోలీవుడ్‌లో సినిమా గుడ్‌నైట్ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. అందరినీ అలరించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీతా రఘునాథ్ నటించింది. ఆమె నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఇదే పేరుతో గుడ్‌నైట్ సినిమా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులో కూడా హీరోయిన్ మీతా రఘునాథ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కాగా.. ఈ హీరోయిన్ ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో మీతా ఏడు అడుగులు వేసింది.
ప్రస్తుతం హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీతా రఘునాథ్‌కు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. మీథా రఘునాథ్ ముదల్ ముదివమ్ నీ అనే సినిమాతో 2022లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత చాలా సినిమాల్లోనే నటించిని మీతా రఘునాథ్. కానీ.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల నటించిన గుడ్‌నైట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.
Meetha Raghunath Marriage Pics#MeethaRaghunath ♥️ @RaghunathMeetha pic.twitter.com/DnlcHyUgWk
— CINE Talk (@talk_cinetalk) March 18, 2024