వచ్చేసిన వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమా టీజర్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్ర ‘గాండీవధారి అర్జున’.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 11:42 AM IST
Gandivdhari Arjuna, Movie, Varun Tej, Teaser,

వచ్చేసిన వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమా టీజర్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్ర ‘గాండీవధారి అర్జున’. యాక్షన్ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో వరుణ్‌ తేజ్‌ లుక్స్‌ జేమ్స్‌ బాండ్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌ అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రీ టీజర్‌ ఎలా ఉండబోతుందో అనే హింట్‌ ఇచ్చింది. ప్రీ టీజర్‌లో ఓ రేంజ్‌ యాక్షన్ స్టంట్స్‌ను చూపించి డైరెక్టర్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేశారు. తాజాగా విడుదలైన టీజర్‌ కూడా అదే రేంజ్‌లో ఉంది. యాక్షన్‌ సీన్స్‌ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి.

‘గాండీవధారి అర్జున’ టీజర్‌ను చూస్తోంటే సినిమా మొత్తం విదేశాల్లోనే కొనసాగినట్లు అర్థమవుతోంది. ఇక ప్రవీణ్‌ సత్తార్ సినిమాల్లో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ సినిమా అయితే హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సీన్లు ఉన్నట్లు అర్థం అవుతోంది. చేజింగ్‌ సీక్వెన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్‌తో టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈసారి వరుణ్‌ తేజ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ మూవీ పడటం పక్కా అని పలువురు అంటున్నారు. టీజర్‌ చూసిన కొందరు నెటిజన్లు అయితే.. వరుణ్‌ తేజ్‌ కటౌట్‌కు సరిపోయే సినిమా ఇది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘గాండీవధారి అర్జున’ సినిమాలో వరుణ్‌తేజ్‌ సరసన హీరోయిన్‌గా సాక్షి వైద్య నటిస్తోంది. వరుణ్‌తో పాటు సాక్షి యాక్షన్ సీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టీజర్ కనిపించిన విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 25న ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story