మళ్లీ జైలుకు వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్.. ఈసారి ఎందుకంటే..!

Fun Bucket Bhargav Again Arrested.ఫన్ బకెట్ భార్గవ్.. ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే

By M.S.R  Published on  6 Nov 2021 5:04 AM GMT
మళ్లీ జైలుకు వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్.. ఈసారి ఎందుకంటే..!

ఫన్ బకెట్ భార్గవ్.. ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అతడు జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల బాలికని గర్భ‌వ‌తిని చేశాడు. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. 'దిశ', ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భార్గ‌వ్ ఇటీవ‌ల బెయిల్ పై బయటకి వచ్చాడు. జైలు నుండి వచ్చిన భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ, పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై బయటకు రాగా.. ఆ ష‌ర‌తుల‌ను ఉల్లంఘించాడు. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమోలో పొందుపరిచారు పోలీసులు. దీంతో పోక్సో కోర్ట్ బెయిల్ రద్దు చేసి రిమాండ్ విధించడంతో మరో సారి జైలు పాలయ్యాడు. ఈ నెల 11 వరకూ అతడు రిమాండ్ లో ఉండనున్నాడు.

సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో చాలామంది అమ్మాయిలకు దగ్గరై అతను వారిని శారీరకంగా లొంగదీసుకున్నాడనేవార్తలు వచ్చాయి. టిక్ టాక్ లో అమ్మాయిలను స్టార్ చేస్తానని నమ్మించి భార్గవ్ వలలో వేసుకున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్ పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18 న అరెస్ట్‌ అయ్యాడు. అయితే ఈ కేసులో జూన్ 15 న షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో మరోసారి జైలు పాలయ్యాడు.

Next Story
Share it