ఉత్తమ చిత్రం 'బలగం'.. బెస్ట్ యాక్టర్ నాని, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
హైదరాబాద్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 వేడుక ఘనంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 7:52 AM IST![filmfare awards, telugu awards, best movie balagam, filmfare awards, telugu awards, best movie balagam,](https://telugu.newsmeter.in/h-upload/2024/08/04/378586-filmfare-awards-telugu-awards-best-movie-balagam.webp)
ఉత్తమ చిత్రం 'బలగం'.. బెస్ట్ యాక్టర్ నాని, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
హైదరాబాద్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 వేడుక ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. డ్యాన్స్‌లతో పలువురు హీరోయిన్లు ఆకట్టుకున్నారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తదితరుల ప్రదర్శనలు అతిథులను అలరించింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు.. ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు. ‘దసరా’ సినిమాలో నటనకు గానూ నాని, కీర్తి సురేష్‌లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. ‘బేబీ’ చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.
69 శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ తెలుగు విజేతలు:
ఉత్తమ సినిమా: బలగం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు పాట, సార్)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్.. దసరా)