బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 12:14 PM GMTబాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.
మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు, ఆ బెట్టింగ్ యాప్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా విశాఖలో 10 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ సంస్థకు చెందిన రూ.417 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
దుబాయ్ కేంద్రంగా ఉన్న ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతోమంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే.. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వేల కోట్ల రూపయాలు కొట్టేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడి అయినట్లు తెలుస్తోంది. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని వైపులా దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు రణ్‌బీర్ కపూర్‌ను విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తులో భాగంగా మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌కి ప్రచారకర్తగా ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.