'బేబీ' సినిమా గురించి మనసులో మాట చెప్పిన డైరెక్టర్ సుకుమార్

చాలా కాలం తర్వాత ఒక అసాధారణమైన రచన చూశానని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 3:24 PM IST
Director Sukumar, Baby Movie, Instagram

'బేబీ' సినిమా గురించి మనసులో మాట చెప్పిన డైరెక్టర్ సుకుమార్

ఇటీవల విడుదలైన 'బేబీ' సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. చిన్న సినిమా అయినా పెద్ద హిట్‌ కొట్టేసింది. రోజురోజుకూ క్రేజ్‌ పెరుగుతూనే ఉంది.. కొన్నిచోట్ల హౌజ్‌ఫుల్‌ బోర్డు ఉంటోంది. ప్రేక్షకుల నుంచే కాదు.. సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్లు 'బేబీ' సినిమా గురించి తరచూ మాట్లాడుతూనే ఉన్నాయి. తాజాగా డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా ఈ సినిమా గురించి మనసులో మాట బయటకు చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన బేబీ సినిమా చూసి.. తన అభినందనలు తెలిపారు.

చాలా కాలం తర్వాత ఒక అసాధారణమైన రచన చూశానని, అలాగే సినిమా ఒక కొత్త ఒరవడిని, పంథాను తీసుకొస్తుందని అన్నారు. ప్రతి సన్నివేశం తనకు ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా అనిపించిందని చెప్పారు సుకుమార్. మొదటిసారిగా తాను ఒక సినిమాలో సిచ్యువేషన్‌ని కూడా పాత్రల తరహాలో చూశాని బేబీ సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. సాయి రాజేశ్‌కు అభినందనలు తెలిపారు సుకుమార్. అలాగే కథను నమ్మి సాయి రాజేశ్‌కి సపోర్ట్‌ చేసిని నిర్మాత ఎస్‌కేఎన్‌, దర్శకుడు మారుతిలను కూడా అభినందిస్తున్నానని చెప్పారు డైరెక్టర్ సుకుమార్.

ఇక నటీనటుల అయితే పాత్రలకు జీవం పోశారని అన్నారు. వైష్ణవి నటించిన పాత్ర ఒక ఐకానిక్‌ అని చెప్పారు. అటువంటి పాత్రను వైష్ణవి చైతన్య తన నటనతో లీనమై ఆ పాత్రకు జీవం పోశారని.. ఎంతో కొనియాడారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆనంద్‌ దేవరకొండ బ్రిలియంట్‌ యాక్టింగ్‌ అని.. విరాజ్‌ అశ్విన్‌ కూడా బాగా చేశారని సుకుమార్‌ కొనియాడారు. విజయ్ బాల్గానిన్‌ సంగీతం అందమైన దృశ్యంలా ఉంటే, బాలారెడ్డి సినిమాటోగ్రఫీ మూవీకి మెలోడియస్‌ ట్యూన్‌లా ఉందని చెప్పారు. గొప్ప సినిమాను తీసిన బేబీ చిత్ర నటీనటులకు, సాంకేతిక తనిపుణులకు సుకుమార్‌ అభినందనలు తెలిపారు .

ఐకాన్‌ స్టార్‌ అల్ల అర్జున్‌తో సుకుమార్‌ పుష్ప-2 డైరెక్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. పెద్ద డైరెక్టర్‌ తమ సినిమా గురించి పొగడ్తలతో ముంచెత్తడంతో 'బేబీ' చిత్ర యూనిట్ ఎంతో సంబరపడిపోతుంది.

Next Story