షారుక్‌ఖాన్‌కు పాదాభివందనం చేసిన స్టార్ డైరెక్టర్ అట్లీ (వీడియో)

మార్చి 10వ తేదీన ముంబై వేదికగా జీ సినీ అవార్డుల వేడుక జరిగింది. ఇక్కడ ఆసక్తికర ఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 12:23 PM IST
director Atlee,  salute, Shah Rukh Khan, cinema ,

షారుక్‌ఖాన్‌కు పాదాభివందనం చేసిన స్టార్ డైరెక్టర్ అట్లీ (వీడియో)

సూపర్‌ హిట్‌ సినిమాలు తీసి స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు అట్లీ. ఇతను తీసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల అట్లీ షారుక్‌ఖాన్‌తో తీసిన జవాన్‌ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు.. పలు అవార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా జీ సినీ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జవాన్‌ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అట్లీ అవార్డును అందుకున్నాడు.

బాలీవుడ్‌ బాద్‌షాగా పిలిచే షారుక్‌ఖాన్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఒక్క హిందీలోనే కాదు షారుఖ్‌ సినిమాలో అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్లను రాబడతాయి. అయితే.. అలాంటి పెద్ద హీరోతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ను ఇచ్చాడు అట్లీ. జవాన్ సినిమా తర్వాత అట్లీ, షారుఖ్‌ మధ్య మంచి బంధం ఏర్పడింది. మార్చి 10వ తేదీన ముంబై వేదికగా జీ సినీ అవార్డుల వేడుక జరిగింది. ఇక్కడ ఆసక్తికర ఘటన జరిగింది.

జవాన్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా అట్లీ పేరును ప్రకటించగానే.. షారుక్‌ఖాన్‌ను పాదాభివందన చేశాడు అట్లీ. దాంతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా పైకి లేచి చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత స్టేజిపైకి వెళ్లిన అట్లీ అవార్డును అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అట్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన కూడా షారుక్‌కు ఇస్తోన్న గౌరవాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఇక ఇదే వేడుకలో ఉత్తమ నటుడిగా షారుక్‌కాన్‌ కూడా అవార్డును అందుకోవడం విశేషం.


Next Story