టీజర్ లాంచ్‌లో హీరోయిన్‌కి ముద్దిచ్చిన డైరెక్టర్..వీడియో వైరల్
ఓ డైరెక్టర్ మీడియా ముందే హీరోయిన్‌కి ముద్దు పెట్టారు. వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 11:16 AM IST
టీజర్ లాంచ్‌లో హీరోయిన్‌కి ముద్దిచ్చిన డైరెక్టర్..వీడియో వైరల్
ఇది సోషల్ మీడియా ఉన్న ప్రపంచం. ఏ పనిచేసినా కాస్త జాగ్రత్త వహించాల్సిందే. లేదంటే వైరల్ అయ్యిపోతాం. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరి కళ్లు వారిపైనే ఉంటాయి. పొరపాటున ఒక్క వైరల్ వీడియో చేతికి చిక్కినా.. వివాదానికి కేరాఫ్‌గా మారుతారు. సోషల్ మీడియాను కొందరు మంచి కోసం ఉపయోగిస్తే.. కొందరు మాత్రం ఇలా వైరల్ అయ్యే వీడియోలు, ఫొటోల కోసమే వాడుతుంటారు. ప్రస్తుతం ఒక డైరెక్టర్ కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. ఆయనే ఏఎస్ రవికుమార్ చౌదరి. ఈయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు కావొచ్చు.. కానీ ఆయన సినిమాలు మాత్రం హిట్ సాధించవే. యజ్ఞం, పిల్లా నువ్వలేని జీవితం వంటి సూపర్ హిట్స్ అందించారు.
ప్రస్తుతం రవికుమార్ చౌదరి.. రాజ్ తరుణ్‌తో ' ‘తిరగబడరా సామి’ తీస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీలో జక్కన్న, రోగ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపంచిన మన్నారా చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. టీజర్ విడుదల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మన్నారా చోప్రాకు డైరెక్టర్ ముందు పెట్టారు. అది మీడియా ముందే.. కెమెరాలు ఆన్‌లో ఉన్న సమయంలోనే. దాంతో.. హీరోయిన్ కూడా షాక్ అయ్యినట్లు కనిపించింది. కానీ.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నవ్వుతూ కవర్ చేసినట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది. అయితే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తీరుని తప్పు బడుతున్నారు.
నటీమణులతో ఇలా వ్యవహించడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయొద్దంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక నటులు కూడా ఇలాంటి ఘటనలను ప్రతిఘటించాలని చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టగా.. అప్పట్లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. చివరకు కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చోటా కే నాయుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి వీడియో కూడా వైరల్ అవుతోంది. మరి ఈయన ఎలా స్పందిస్తారో చూడాలి.
#PriyankaChopra’s cousin, actress #Mannarachopra gets kissed by director AS Ravikumar in front of the media! 🤦🏼♂️#TiragabadaraSaamipic.twitter.com/54w5JHvjIv
— Ajay AJ (@AjayTweets07) August 29, 2023