పెట్రోల్‌ ఊరికే రావట్లేదు..ట్రాఫిక్‌ డీసీపీ ఎక్కడ?: డింపుల్ హయాతి

డింపుల్‌ హయాతి ట్రాఫిక్‌ డీసీపీని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ చేసింది.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 7:26 AM GMT
Dimple Hayathi, Tweet, Traffic DCP, Rahul Hegde,

పెట్రోల్‌ ఊరికే రావట్లేదు..ట్రాఫిక్‌ డీసీపీ ఎక్కడ?: డింపుల్ హయాతి

కొద్ది రోజుల క్రితం నటి డింపుల్‌ హయాతి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే మధ్య వివాదం జరిగింది. ఇద్దరూ నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ డింపుపై.. సదురు డీసీపీ కేసు ఫైల్‌ చేసి ఆమెను ఇబ్బందులు పెట్టే స్థాయి వరకూ వెళ్లింది. తనపై కేసు పెట్టిన ట్రాఫిక్‌ డీసీపీని హీరోయిన్‌ డింపుల్‌ కూడా అంత ఈజీగా ఎందుకు వదలిస్తుంది. సమయం వచ్చినప్పుడు కడిగేస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ క్రమంలోనే డింపుల్‌ హయాతి ట్రాఫిక్‌ డీసీపీని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ చేసింది.

అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్‌ సమయంలో నటి డింపుల్‌ హయాతికి ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేకి మధ్య వివాదం చోటుచేసుకుంది. డింపుల్‌ తన వాహనాన్ని డ్యామేజ్‌ చేసిందని ట్రాఫిక్‌ డీసీపీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏకంగా కేసు పెట్టారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. దానికి డింపుల్‌ కూడా సరైన సమాధానమే చెప్పింది. ట్రాఫిక్‌ డీసీపీ పవర్‌ ఉంది కదా అని అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ పార్కింగ్‌లో రోడ్‌ మీద వేయాల్సిన సిమెంట్‌ దిమ్మెలు తెచ్చి పెట్టి అందరినీ ఇబ్బందులకు గురి చేయయం సబబు కాదంటూ డీసీపీకి కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయం లాయర్‌తో చెప్పించిన విషయం కూడా అందరికీ తెలుసు. అయితే.. తాజాగా మరోసారి ట్రాఫిక్‌ డీసీపీని ఉద్దేశిస్తూ డింపుల్‌ ట్వీట్‌ చేసింది.

రెండ్రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. దాంతో.. ట్రాఫిక్‌ జాం భారీగా ఏర్పడుతోంది. వాహనదారులు కిలోమీటరు దూరం ప్రయాణించడానికి కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదల్లేక విపరీతమైన ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న డింపుల్‌ హయాతి డీసీపీ రాహుల్‌ హెగ్డేను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది.

డింపుల్ ఎక్కడికో వెళ్లి తన ఇంటికి తిరిగి వెళుతూ దుర్గం చెరువు ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ లో చిక్కుకుంది. గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అయినట్టుగా కనపడుతోంది. ఇదే అదునుగా ఆమె వెంటనే తన ట్విట్టర్ లో ట్రాఫిక్ రోజు రోజుకీ మరీ దారుణంగా తయారవుతోంది, ఇంటికి వెళ్ళడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది అని రాసుకొచ్చింది. అసలు ఈ ట్రాఫిక్ డీసీపీలు అందరూ ఎక్కడున్నారు? ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏంటి పరిస్థితి? అంటూ ప్రశ్నించింది డింపుల్‌ హయాతి. హైదరాబాద్ లో బయటకి అడుగుపెట్టే పరిస్థితి ఉందా? పెట్రోల్ మాకు ఫ్రీగా రావటం లేదు అంటూ ప్రభుత్వాన్ని కూడా ప్రస్తావించింది డింపుల్ హయాతి. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌ హెగ్డేను అడిగిన ప్రశ్నగానే నెటిజన్లు భావిస్తున్నారు. మరి ట్రాఫిక్‌ డీసీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story