ఎన్టీఆర్ 'దేవర' మూవీ కొత్త రిలీజ్ తేదీని ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 6:16 PM ISTఎన్టీఆర్ 'దేవర' మూవీ కొత్త రిలీజ్ తేదీని ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వస్తుండటం.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. దాంతో.. ఎన్టీఆర్ అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో జనతా గ్యారెజ్ వంటి హిట్ సినిమా వచ్చింది. దాంతో.. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇదివరకే ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో చెప్పారు. కానీ.. కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రకటన విడుదల ఏసింది. దేవర సినిమా ఏప్రిల్ 5న కాకుండా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారికంగా ఈ ప్రకటన చేశారు మూవీ మేకర్స్.
దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ముందు ప్రకటించిన తేదీ కంటే సుమారు ఆరు నెలలు ఆలస్యంగా విడుదల అవుతుంది దేవర సినిమా. కాగా.. 2018లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత కూడా దసరా సందర్భంగానే థియేటర్లలో విడుదలైంది. అప్పుడా సినిమా బిగ్ హిట్‌గా నిఇచింది. ఇక తాజాగా దేవర సినిమాలో కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
దేవర సినిమాను మొదట ఒకే పార్ట్‌గా తీయాలని భావించినా అది సాధ్యపడలేదు. దాంతో.. రెండు పార్టులుగా తీస్తున్నట్లు కొరటాల శివ ప్రకటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తుండటంతో ఒక పాత్రకు జోడీకి శృతి మరాఠేని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
The Lord of Fear is unleashing his tsunami of electrifying action on 10.10.24 🌊#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @NTRArtsOfficial @DevaraMovie… pic.twitter.com/CXSDy4m4dc
— Devara (@DevaraMovie) February 16, 2024