దేవర మరో రికార్డు.. ఏకంగా 42 షోలు
దేవర సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబుతోంది.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 7:30 PM ISTఅభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దేవర సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర పండుగకి సిద్ధం అయ్యారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. రిలీజ్‌కు ముందే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా గుంటూరు కారం సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి కేవలం కొన్ని గంటలే ఉంది. ఈ యాక్షన్ సినిమాను చూడడానికి ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర కొత్త రికార్డును బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దేవర సినిమాకు సంబంధించి 42 షోలను ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 27న అర్ధరాత్రి ఒంటి గంటకు స్క్రీనింగ్‌తో షో ప్రారంభమవుతుంది. ఈ థియేటర్ లో అత్యధిక షోలను స్క్రీనింగ్ చేసిన సినిమాగా గుంటూరు కారం పేరు మీద ఇప్పటిదాకా రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డు దేవర సొంతం చేసుకుంది. గతంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీకి సంబంధించి 41 షోలను స్క్రీనింగ్ చేసింది. కాగా భారీ అంచనాలు ఉన్న దేవర మూవీ 100 కోట్ల ఓపెనింగ్ రాబడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.