దేత్తడి హారిక చేతిలోకి క్రేజీ ప్రాజెక్ట్‌... హీరోయిన్‌గా ఎంట్రీ

దేత్తడి హారికకు మంచి ఆఫర్ వచ్చిందట. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 2:45 PM GMT
Dethadi harika,  heroine,  movie,

దేత్తడి హారిక చేతిలోకి క్రేజీ ప్రాజెక్ట్‌... హీరోయిన్‌గా ఎంట్రీ

దేత్తడి హారిక.. ఈమె యూట్యూబ్‌ స్టార్.. బిగ్‌బాస్‌లో కూడా కనిపించింది. ఈమె తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికీ పరిచయస్తురాలే. అయితే.. దేత్తడి హారిక యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈమె చేసే ప్రతి వీడియోకు చాలా వ్యూస్‌ వచ్చేవి. అదే క్రేజ్‌ హారికను బిగ్‌బాస్‌ షోకి తీసుకెళ్లేలా చేసింది. బిగ్‌బాస్‌లో కూడా ఆమె తన టాలెంట్‌ను చూపించింది. టాప్‌ ఫైవ్‌ వరకూ వచ్చింది. అయితే.. ఆమె బుల్లితెరకు మాత్రం దూరంగానే ఉండింది. కానీ.. ఇప్పుడు హారికకు మంచి ఆఫర్ వచ్చిందట. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ ప్రధాన కథానాయకుడు కాగా.. అతనికి జోడీగా దేత్తడి హారిక హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా ఇది హారికకు మొదటి సినిమా. అయితే.. ఈ మూవీని బేబీ సినిమా మేకర్స్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌, డైరెక్టర్‌ రాజేష్‌ కలిసి తీస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. డైరెక్టర్‌గా సాయి రాజేశ్‌ ఇప్పటికే బేబీ సినిమాతో యూట్యూబర్‌ వైష్ణవి చైతన్యకు బిగ్‌ హిట్‌ ఇచ్చాడు. మరోసారి తన సినిమాలో ఇంకో తెలుగు యూట్యూబర్‌ను తీసుకోవడం ద్వారా మరో హీరోయిన్‌ని టాలీవుడ్‌కు అందిస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ పూర్తయ్యినట్లు సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

చిన్న సినిమాలకు బెస్ట్‌ ఆప్షన్‌ సంతోష్‌ శోభన్‌. అతడితో సినిమా తీస్తే మినిమమ్‌ ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుందన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక సినిమాలతో పాటు పలు షోలల్లో కనిపించిన హారికకు మాత్రం మంచి బ్రేక్‌ రాలేదు. కానీ.. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యి.. మంచి హిట్‌ పడితే హారిక కెరీర్‌ మారిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Next Story