డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష
తమిళ డైరెక్టర్ లింగుస్వామి(లింగు సామి) కి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో 2014లో పీవీపీ సంస్థ
By M.S.R Published on 13 April 2023 1:45 PM GMTడైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష
తమిళ డైరెక్టర్ లింగుస్వామి(లింగు సామి) కి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో 2014లో పీవీపీ సంస్థ నుంచి లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ రూ. కోటికి పైగా రుణం తీసుకున్నారు. వీరు తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. అప్పు తిరిగి చెల్లించేందుకు సంబంధించి వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ సంస్థ వారిపై చెక్ బౌన్స్ కేసు పెట్టింది. కేసును విచారించిన చెన్నై సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దర్శకుడు లింగుస్వామికి చెక్ ఫ్రాడ్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై లింగుస్వామి అప్పీల్ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి అప్పీలుకు వెళ్తామని లింగుస్వామి అంటున్నారు.
లింగుస్వామి మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ మంచి ఫాలోయింగ్ ను అందుకున్నాడు. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి భారీ హిట్స్ గా నిలిచాయి. పందెంకోడి, ఆవారా ఆయన తీసిన సినిమాలే..! ఒకప్పుడు ఆయనతో సినిమా చేయడానికి తెలుగు స్టార్ హీరోలు కూడా ఎగబడ్డారు. కానీ ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. గతేడాది రామ్ హీరోగా తెలుగు, తమిళ్‌లో ఆయన ద్విభాషా చిత్రంగా ‘వారియర్’ తీసినా.. ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, మంచి కలెక్షన్స్ రాలేదు. లాంగ్ రన్ లో సినిమా ఫ్లాప్ గా నిలిచింది.