కమెడియన్ అవినాశ్ ఇంట్లో విషాదం

అవినాశ్‌ తమ ఇంట్లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుందని చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 8:32 AM IST
comedian, avinash, lost,  baby ,

 కమెడియన్ అవినాశ్ ఇంట్లో విషాదం 

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే.. వారిలో ఒకరే అవినాశ్. ముక్కు అవినాశ్‌గా పేరు తెచ్చుకున్న అవినాశ్‌ పలు ఈవెంట్స్‌తో పాటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే.. అవినాశ్కు 2021 నవంబర్‌లో అనూజ అనే యువతిని వివాహం చేసుకున్నారు. తాజాగా అవినాశ్‌ తమ ఇంట్లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుందని చెప్పారు. తాము బిడ్డను కోల్పోయినట్లు సోషల్‌ మీడియా వేదికగా బాధను వ్యక్తం చేశారు.

కొంతకాలంగా భార్యతో కలిసి ప్రెగ్నెసీ విషయంలో అవినాశ్‌ పలు వీడియోలు చేశాడు. వాటిని సోషల్‌ మీడియాలో కూడా అప్‌లోడ్‌ చేస్తూ ఉండేవారు. అయితే.. ఇప్పుడు బిడ్డను కోల్పోవడంతో ఎంతో బాధపడుతున్నారు అవినాశ్ దంపతులు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేనిదంటూ ఆవేదన చెందాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన అవినాశ్.. తన లైఫ్‌లో సంతోషమైనా, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాననీ అభిమానులకు చెప్పాడు. ఇప్పటి వరకు ప్రతి ఆనందాన్ని పంచుకున్నాననీ.. మొదటిసారి జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని పంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అమ్మనాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురుచూశామనీ.. కాని కొన్ని కారణాల వల్ల తమ బిడ్డను కోల్పోయినట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు అవినాశ్. ఈ విషయాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేమని ఆవేదన చెందాడు.

ఇది అంత తొందరగా మర్చిపోలేనిది అనీ.. ఎప్పటికైనా మీకు చెప్పాలని అన్న బాధ్యతతో ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు చూపించిన ప్రేమకు థాంక్యూ అంటూ ప్రేక్షకులకు చెప్పాడు అవినాశ్. ఇలానే ఈ ప్రేమ కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే ఈ విషయం గురించి మరిన్ని ప్రశ్నలు అడిగి బాధ పెట్టొద్దని కోరాడు అవినాశ్. అర్థం చేసుకుంటారనీ ఆశిస్తనట్లు పేర్కొన్నారు. ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు ధైర్యంగా ఉండాలంటూ అవినాశ్‌ దంపతులను ఓదారస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story