జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌పై కీలక అప్డేట్ విడుదల చేసిన డైరెక్టర్

దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు. తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 1:36 PM IST
CM Jagan,Biopic Yatra-2,Director Mahi V Raghav

జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ పై కీలక అప్డేట్ విడుదల చేసిన డైరెక్టర్

2019లో వచ్చిన ‘యాత్ర’ సినిమా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు యాత్ర సినిమా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ‘యాత్ర-2’ కూడా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సారి యాత్ర-2 సినిమాను ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత సీఎం జగన్‌ బయోపిక్‌గా తీయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యాత్ర సినిమా డైరెక్టర్‌ మహి వి రాఘవ్ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తమిళ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

‘యాత్ర’ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు. ఈ క్రమంలో మహి వి రాఘవ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌ గురించి ట్వీట్ చేశారు. ఆయన మ్యూజిక్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు మహి వి రాఘవ్. కథ చెప్పడంతో పాటు.. కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మలయాళ మెగాస్టార్‌ ముమ్ముట్టి.. 2019లో విడుదలైన యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో కనిపించారు. యాత్ర-2లో కూడా ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం వైఎస్‌ జగన్ పాత్రలో తమిళ స్టార్‌ హీరో జీవా నటించే అవకాశం ఉంది. యాత్ర-2 కోసం ముమ్ముట్టి రూ.14 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నట్లు సినిమా వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్‌ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. 2024లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యాత్ర-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే చాన్స్‌ ఉంది. ఈ క్రమంలో ఓటర్లపైనా ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Next Story