'ఆర్‌ఆర్‌ఆర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి...?
Chiranjeevi voice over for RRR Movie I 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి...?
By సుభాష్ Published on 27 Nov 2020 10:29 AM ISTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్. అయితే ప్రక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్డీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వెండితెరపై కనిపించకుండానే ప్రేక్షకులను మెప్పించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో రామ్‌చరణ్, ఎన్డీఆర్ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళిని అడుగగానే చిరంజీవి కూడా ఓకే చెప్పారనేశారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ సదరు వార్తలు విని సీని ప్రియులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ హిందీ వెర్షన్‌కి అమిర్‌ఖాన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. అలాగే మిగితా దక్షిణాది భాషలకు సంబంధించి ఆయా ఇండస్ట్రీలకు చెందిన ఓ స్టార్ హీరో ఈ మూవీకి గాత్రం ఇవ్వనున్నట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీంగా ఎన్డీఆర్ కనిపించనున్న ఈ మూవీలో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు నటిస్తున్నారు. రామ్ చరణ్‌సరసన బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్డీఆర్ సరసనొలీవియా మోరీస్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.